‘దళితబస్తీ’ భూమి పరిశీలన


Sat,December 7, 2019 11:58 PM

సిరికొండ : మండంలోని పొన్న గ్రామంలో ఎస్సీ కార్పొషరేషన్‌ ఈడీ శంకర్‌, మండల రెవెన్యూ ఆధికారులు దళిత బస్తీ వ్యవసాయ భూమిని శని వారం పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాదారు ఎం.మారుతి వ్యవసాయ భూమి లబ్ధిదారులకు చూపించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొషరేషన్‌ ఈడీ మాట్లాడుతూ... పొన్న గ్రామంలో ఉన్న సర్వే 76లో పట్టాదారు మారుతి వ్యవసాయ భూమిని లబ్ధిదారులు రాధాబాయికి చూపించామన్నారు. దళిత బస్తీకి వ్యవసాయ భూమివిక్రయించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. జేసీతో ముందు వ్యవసాయ భూమి రేటు మాట్లాడి మూడు ఎకరాల భూమిని దళితబస్తీ కింద లబ్ధిదారుకు అందిస్తామని తెలిపారు. ఈడీ వెంట గిర్ధావర్‌ యజ్వేందర్‌రెడ్డి, పట్టాదారు మారుతి, లబ్ధిదారు రాధాబాయి, సోంపల్లి ఎంపీటీసీ సూర్యకాంత్‌ ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles