యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి


Sat,December 7, 2019 11:58 PM

-ఎస్‌ఎంఏఎం జాతీయ మానిటరింగ్‌ అధికారి
ఉట్నూర్‌ రూరల్‌ : ప్రభుత్వం ద్వారా తీసుకున్న వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ (ఎస్‌ఎంఏఎం) జాతీయ మానిటరింగ్‌ అధికారి శశిభూషణ్‌ అన్నారు. శనివారం జిల్లా వ్యవసాయ అధికారి రమేశ్‌తో కలిసి ఉట్నూర్‌ మండలంలోని పులిమడుగు, సాకేరా, సాలేవాడ (బి), లక్షటిపేట్‌, లక్కారం గ్రామాలను సందర్శించారు. గ్రామంలో రైతులు ప్రభుత్వం ద్వారా రాయితీ కింద తీసుకున్న ట్రాక్టర్‌ పనిముట్లను పరిశీలించారు. రైతులు భూమి వివరాలతోపాటు సరైన లబ్ధిదారులా.. కాదా..? అనే విషయాన్ని పరిశీలించారు. వారి పట్టా, భూమి విస్తీర్ణం, వారు పండిస్తున్న పంటల గురించి అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడారు. ముఖ్యంగా రాయితీ యంత్రాలతో లబ్ధి పొందుతున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. రాయితీ పనిముట్లు తీసుకునే క్రమంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా.. అని రైతుల ద్వారా తెలుకున్నారు. ప్రభుత్వం ద్వారా తీసుకున్న ప్రతీ పరికారాన్ని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో దేవేందర్‌, సుధాకర్‌, రైతులు శ్యాంరావు, తహేరా బేగం, భూమన్న, బాలకృష్ణ, వెంకట్రావు ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles