ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలి


Sat,December 7, 2019 12:26 AM

ఆదిలాబాద్ రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నివసించే ప్రతి ఒక్కరికీ రోగనిరోధక టీకాలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డీఐవో) శ్రీకాంత్ సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ మండల పరిధిలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇమ్యునైజేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గ్రామాల వారీగా ఎక్కడెక్కడ టీకాలు వేశారో పూర్తి వివరాలను సేకరించారు. ఎవరెవరు టీకాలు వేస్తున్నారని వైద్యురాలు రోజారాణిని అడిగి తెలుసుకున్నారు. ఐఎల్‌ఆర్, డీఫ్రీజ్, కోల్డ్ చైన్‌సిస్టమ్, వ్యాక్సిన్ భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆవాస ప్రాంతాల్లో నివసించే వారికి తప్పని సరిగా టీకాలు వేయాలని ఆదేశించారు. పలు గ్రామ శివార్లలో వలస కార్మికులను గుర్తించి వారి అవగాహన కల్పించి టీకాలు వేయాలన్నారు. అంతకు ముందు లోకారి గ్రామంలో నిర్వహించిన ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాక్సిన్ కోల్డ్‌చైన్ మేనేజర్ సాయి, చేతన్, సిబ్బంది బి.సుభాష్, కే.జయశ్రీ, ఎం.శ్రీనివాస్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles