తహసీల్‌పై నిఘా


Thu,December 5, 2019 04:10 AM

-భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
-నార్నూర్‌ కార్యాలయంలో అమర్చిన అధికారులు
-ఇప్పటికే రిసెప్షన్‌ కౌంటర్ల ఏర్పాటు


నార్నూర్‌ : జిల్లా వ్యాప్తంగా తహసీల్‌ కార్యాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య నేపథ్యంలో రెవెన్యూశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేసింది. భద్రత పరమైన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తహసీల్దార్ల సలహాలు, సూచనలు తీసుకున్నారు. పోలీసులతో భద్రత దీర్ఘకాలికంగా సాధ్యం కాదని భావించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలోని 18 తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిసెప్షన్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి ముగ్గురు వీఆర్‌ఏలను భద్రత కోసం నియమించనున్నారు. ఇందులో ఒక మహిళా వీఆర్‌ఏతో పాటు ఇద్దరు పురుష వీఆర్‌ఏలు ఉంటారు. తహసీల్‌ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మినహా ఇతర కార్యాలయం నుంచి వచ్చినా, వివిధ పనుల నిమిత్తం కలువడానికి వచ్చినా ముందుగా వీరు పరిశీలించిన తర్వాతే కార్యాలయంలోనికి అనుమతిస్తారు.

సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ
తహసీల్‌ కార్యాలయాల్లో రిసెప్షెన్‌ కౌంటర్లతోపా టు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కె మెరాల ఏర్పాటుతో నిరంతర పర్యవేక్షణ ఉండనున్నది. ఒక పోలీసు అధికారి ఇక్కడ విధులు ని ర్వహించనున్నారు. నార్నూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో
నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం నిఘా నీడలోకి వెళ్లింది. పనులు పారదర్శకంగా జరగడంతో పాటు సిబ్బంది పని తీరును పరిశీలించేందుకు అలాగే కార్యాలయానికి వచ్చే వారిని గ మనించడానికి ఉపయోగపడుతాయని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కార్యాలయం లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేయడానికి వీలుగా ఉంటుంది. దీంతో సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకుండా పారదర్శకంగా పని చేయించే వీలుంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో సిబ్బంది ప్రవర్తనలో మార్పు రానుండడంతో పారదర్శకపాలన అందనుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా ఫుటేజీలతో గుర్తించేందుకు సులభతరంగా ఉంటుంది. ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయం నీఘా నీడలో ఉంది. అలాగే రెవెన్యూ సిబ్బందికి రక్షణగా పోలీసుశాఖ పర్యవేక్షిస్తున్నది. నిత్యం ఓ పోలీసు అధికారి విధులు నిర్వహిస్తున్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles