అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలి


Thu,December 5, 2019 04:05 AM

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా బుధవారం విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీని ధర్మశాల వద్ద కలెక్టర్‌ ప్రారంభించారు. అంతకు ముందు కలెక్టర్‌ ‘అవినీతిని ప్రోత్సహించనని, అవినీతికి పాల్పడనని, అవినీతి నిర్మూలనకు కృషి చేస్తాన’ని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు పట్టణంలోని పలు వీధులగుండా ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమేనని తెలిపారు. లంచం అడిగితే ఉన్నతాధికారులు, ఏసీబీకి టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064 సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులు న్యాయబద్దంగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, ఏసీబీ సీఐలు ప్రశాంత్‌, నర్సింహ, పంకజ్‌ గుప్తా, హవల్‌దార్‌, నిర్మల్‌ సింగ్‌, సువిద మేనేజర్‌ గురుదీప్‌ సింగ్‌, హర్పాల్‌ సింగ్‌, వివిద పాఠశాలల విద్యార్థులు, పోలీసులు ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles