షీ-టీమ్‌ సేవలను ఉపయోగించుకోవాలి


Thu,December 5, 2019 04:05 AM

సారంగాపూర్‌: పోకిరీలు వెంట పడితే మహిళలు షీటీమ్‌కు వెం టనే ఫోన్‌ చేయాలని డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి సూచించారు. బుధవారం సారంగాపూర్‌ మండలంలోని చిం చోలి(బి) మహిళా ప్రాంగణంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి వ చ్చిన రెండు వందల మహిళలకు షీటీమ్‌పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.... గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, విద్యార్థినులు షీటీమ్‌ సేవలను ఉపయోగించుకో వాల న్నారు.ఆపదలో ఉన్న సమయంలో 100కి ఫోన్‌ చేసి వారితో రక్షణ పొందాలని సూచించారు. మహిళలను వేధించినా, హింసించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు రోడ్డుపై ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు జాన్‌దివాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, షీటీమ్‌ ఎస్సైఅంజమ్మ, సారంగాపూర్‌ ఎస్సై అరాఫత్‌ అలీ పాల్గొన్నారు.


భైంసాలో....
భైంసా, నమస్తే తెలంగాణ : మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, అఘాయిత్యాలను అరికట్టాలంటే.. ధైర్యం, అప్రమత్తత అవసరమని పట్టణ సీఐ వేణుగోపాలరావు అన్నారు. బుధవారం పట్టణంలోని బస్టాండ్‌లో మహిళలు, విద్యార్థినులకు షీటీమ్‌పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మహిళలు భయపడకుండా తమను సంప్రదిస్తే.. తక్షణమే స్పందిస్తామని అన్నారు. ఆపద సమయంలో వెంటనే 100 నెంబరకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు ప్రయాణించే ఆటోలు, ఇతర వాహనాల నెంబర్లను స్నేహితులకు, బంధువులకు మెసేజ్‌ పంపాలన్నారు. కొత్త ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles