గంజాయి విక్రయదారుల అరెస్టు


Thu,December 5, 2019 04:04 AM

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : గంజాయిని విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ సంపత్‌ కృష్ణ తెలిపారు.బుధవారం ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిర్మల్‌ మండలంలోని రాణాపూర్‌ తండా వద్ద నిర్మల్‌ పట్టణానికి చెందిన బొడ్డు సింగ్‌, షేక్‌ షమీమ్‌, షేక్‌ ఇషాక్‌ అహ్మద్‌, మోహన్‌, నేరేడి గొండ మండలం లింగట్లకు చెందిన రనజీత్‌ సింగ్‌ అనే ఐదుగురు కొంత కాలంగా గంజాయిని విక్రయిస్తున్నారని తెలిపారు.


బుధవారం గంజాయిని విక్రయించేందుకు రాగా నిర్మల్‌ రూరల్‌ పరిధిలో వాహనాలను తనిఖీ చేయగా అనుమానాస్పదంగా కనిపించారని వివరించా రు. వీరి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా కిలో గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఐదుగురిలో మోహన్‌ పరారీలో ఉన్నారని తెలిపారు. నర్స య్య, రవి కుమార్‌, కిశోర్‌ తదితరులున్నారు.


భోథ్‌ మండలంలో ఇద్దరు..
బోథ్‌, నమస్తే తెలంగాణ: మండలంలోని పార్డి (కే) గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు ఇచ్చోడ ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజమౌళి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొంత మంది వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నారని జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ రవీందర్‌రాజుకు అందిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో పార్డీ (కే) సమీపంలోని చెరువు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఏపీ 1జి 9780 మోటార్‌ సైకిల్‌పై గొల్లాపూర్‌ గ్రామానికి చెందిన చవాన్‌ నానక్‌సింగ్‌, పున్యానాయక్‌తండాకు చెందిన చవాన్‌ సంతోష్‌ గంజాయిని తరలిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్సై పి రాజేశ్వర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ బాపురావు, కానిస్టేబుళ్లు మహమ్మద్‌, సంధ్య ఉన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles