ఎదులాపురం : ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధిలో ఎస్ఎంసీల పాత్ర కీలకమైనదని, ప్రజల భాగస్వామం ఉన్నప్పుడే పూర్తిస్థాయి ఫలితాలను సాధించగలమని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎ.రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం అంకోలిలో జిల్లా విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అంగన్వాడీ టీచర్లు, సర్చంచులు, ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ విధులు, బాధ్యతలపై శిక్షణి చ్చారు. సెక్టోరల్ అధికార్లు కె.నర్సయ్య, వెంకట రమణ, ప్రధానోపాధ్యాయులు రామయి సంతోష్, ఎం.అశోక్, సీడీపీవో వనజ పాల్గొన్నారు.