నేటి నుంచి గిరిజన గురుకులాల విద్య, వైజ్ఞానిక ప్రదర్శన


Thu,December 5, 2019 04:03 AM

-గిరిజన గురుకులాల సంస్థ ఓఎస్‌డీ శ్రీనివాస్‌ కుమార్‌ వెల్లడి
-రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌కు ఏర్పాట్లు పూర్తి

ఇచ్చోడ : మండల కేంద్రమైన ఇచ్చోడలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 5వ రాష్ట్రస్థాయి గిరిజన విద్య, సాంస్కృతిక, వైజ్ఞానిక సదస్సు పోటీల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని గిరిజన గురుకులాల సంస్థ ఓఎస్‌డీ శ్రీనివాస్‌ కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీలు 5, 6వ తేదీల్లో.. రెండు రోజుల పాటు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 133 గిరిజన గురుకుల పాఠశాలలకు చెందిన సుమారు 1100 మంది విద్యార్థినీ విద్యార్థులు విజ్ఞాన మేళాలో పాల్గొంటున్నారని చెప్పారు.


విద్యార్ధినీ విద్యార్థులకు విద్య, విజ్ఞాన, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. మాక్‌ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7500, తృతీయ బహుమతి రూ.5 వేల చొప్పున ఇవ్వనున్నామని, అత్యుత్తమ ప్రదర్శనలు తయారు చేసిన వారికి ప్రోత్సాహకంగా నగదును అందజేయనున్నామని తెలిపారు. వేడుకలు ముగిసిన మరుసటి రోజు ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులందరికి పర్యాటక ప్రాంతాలైన కుంటాల, పొచ్చెర, బాసర, శ్రీరాంసాగర్‌, కడెం తదితర ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లనున్నామని చెప్పారు. విజ్ఞాన సదస్సును పురస్కరించుకొని స్థానిక పాఠశాలలో ఎత్తు పల్లాలతో కూడిన నాలుగు ఎకరాల మైదానాన్ని బ్లేడు ట్రాక్టర్‌, జేసీబీ సహాయంతో చదును చేయించామన్నారు. వివిధ శాఖలకు చెందిన ఇంజినీరింగ్‌ అధికారుల బృందం పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారని ఆయన వివరించారు.


మేళా ప్రారంభోత్సవం రోజు రాష్ట్ర దేవదాయ, న్యాయ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ నాయక్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌, అడిషనల్‌ సెక్రెటరీ నవీన్‌ నికోలస్‌, ఏపీవో గోపి హాజరవుతారని చెప్పారు. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌, గిరిజన గురుకులం సెక్రెటరీ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, డీఐఈవో దస్రునాయక్‌, డీఈవో రవీందర్‌రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. పోటీల వివరాల బ్రోచర్‌ను విడుదల చేశారు.
ఈ పోటీలను గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నామని స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ఆదివారం ఆయన ఇచ్చోడలో విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల పాటు పోటీలు కొనసాగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో గురుకుల ఆర్‌సీవో లక్ష్మయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావ్‌, మారుతి శర్మ, సత్యనారాయణ, హరిలాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles