తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి


Mon,November 11, 2019 11:58 PM

ఎదులాపురం : తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసే దిశగా విద్యార్థులు కృషి చేయాలని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ పరిధిలో ఉన్న చాంద (టి) మైనార్టీ గురుకుల పాఠశాల 1, 2 (బాలుర)లో మైనార్టీ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ హాజరయ్యారు. విద్యార్థులు అతిథులకు బ్యాండ్‌మేళాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి జడ్పీ చైర్మన్ మాట్లాడారు. తాము చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. మౌలానా అబుల్ కలాం దేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని చెప్పారు. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలని ఉద్దేశంతో ఆనాడే అనేక సమీకరణలు చేశారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇంగ్లిష్ మీడియం గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. చదువుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గురువులు చెప్పిన విద్యను క్రమశిక్షణతో నేర్చుకోవాలన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో ముందున్నామన్నారు. అనతరం పాఠశాలలో పదో తరగతి పరీక్షలు ఎఫ్‌ఏ-వన్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, చాంద (టి) సర్పంచ్ దారట్ల భాస్కర్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, జిల్లా మైనార్టీ అధికారిణి కృష్ణవేణి, టీఆర్‌ఎస్ నాయకులు సాజిద్ ఉద్దీన్, జాహుర్ ఖాన్, యూనిస్ అక్బానీ, మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్స్ సత్యం, అమేర్ అబ్దుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles