జైనథ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు


Mon,November 11, 2019 11:58 PM

జైనథ్ : మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. కార్తీక శుద్ధ చతుర్థశిని పురస్కరించుకొని సోమవారం ఉదయం 9 గంటలకు నిత్య హవనం, రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయమే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సైతం ఆలయంలో భారీ సంఖ్యలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles