తహసీల్దార్ హత్యకు నిరసనగా ఉద్యోగుల ధర్నా


Mon,November 11, 2019 11:58 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు సోమవారం విధులు బహిష్కరించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసీల్దార్ విజయారెడ్డి ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ విభాగం కీలకన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రతి పథకాన్ని అర్హులకు అందజేసే తమ ఉద్యోగులపై రోజురోజుకు బెదిరింపులు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు రామ్‌రెడ్డి, రాజేశ్వర్, వర్ణ, రాజేశ్వరి, ప్రభాకర్ స్వామి, అరవింద్, ప్రవీణ్, సాయిమహేశ్, విలాస్, పలు మండలాల తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles