వరిధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి


Mon,November 11, 2019 11:57 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : వరిధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సాగు దిగుబడికి అనుగునంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని సూచించారు. సరిహద్దు రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండాగట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ దివ్య మాట్లాడుతూ జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా ఉంటుందని ఇటీవల కురిసిన వర్షాలకు తేమశాతం ఎక్కువ ఉండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిధులు ఉన్నాయని, అవసరమైన డ్రై మిషన్, టార్ఫాలిన్, తేమ కొలిచే పరికరం కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, సాఫీగా కొనసాగుతున్నాయని తెలిపారు. వరిధాన్యం కొనుగోలుకు సైతం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ విష్ణువారియర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సుదర్శనం, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles