మైనర్లూ బహుపరాక్..!


Mon,November 11, 2019 12:48 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలో పలు కూడళ్ల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టి మైనర్లు వాహనాలు నడుపుతుండగా పట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు, వాహన యజమానులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మొదటి, రెండోసారి పట్టుబడితే కౌన్సెలింగ్ ఇస్తామని.. మళ్లీ పట్టుబడితే మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు 30 మంది మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు.


జిల్లా కేంద్రంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్
మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు మార్కెట్‌లో కొత్త మోడల్స్‌లో బైకులు వస్తున్నాయి. యువత ఫ్యాషన్ బైకులపై పోటీ పడుతూ రేసింగ్ చేస్తున్నారు. రోజు ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. చేతికి అందివచ్చిన బిడ్డలు ప్రమాదాల్లో గాయపడి మృత్యువాత పడుతూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కళాశాల సమయంలో మైనర్లు బైకులపై రైడింగ్ చేస్తున్నారు. పోలీసు వాట్సాప్, నేరుగా ఎస్పీకి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఫుటేజీని పరిశీలిస్తూ చర్యలు చేపట్టాలని ఎస్పీ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేట్టారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కాలేజీల ముందర డ్రైవ్ చేపట్టి మైనర్లు వాహనాలు నడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.

అవగాహన కార్యక్రమాలు
మోటారు వాహనం చట్టం కింద ద్విచక్ర వాహనం నడపడానికి 16 నుంచి 18 ఏండ్లు నిండిన వారు లైసెన్స్‌కు అర్హలు. గేరు వాహనం నడుపడానికి 18 ఏండ్లు పైబడిన వారు అర్హులు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే మోటారు వాహన చట్టం కింద వాహన యజమానులు, తల్లిదండ్రులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. ఏదైనా ప్రమాదం చేస్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ విషయమై ట్రాఫిక్ పోలీసులు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబ్బందనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles