ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత


Mon,November 11, 2019 12:47 AM

ఎదులాపురం : ఆధ్యాత్మిక మార్గంతోనే మనిషి జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ధోబీ కాలనీలో ఉన్న లక్ష్మీదేవి ఆలయ అభివృద్ధి కోసం రూ.5 లక్షలతో పనులకు కాలనీవాసులతో ఎమ్మెల్యే కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాకే టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని దేవాలయాల నిర్మాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. అమ్మవారి రూపంలో ఉన్న ఏ దేవత అయినా శక్తి స్వరూపంగా భావిస్తామన్నారు.


భక్తిశ్రద్ధలతో పూజిస్తే అంతా క్షేమమే జరుగుతుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నరేందర్, భరత్, రాజు, అశోక్, వసంత్, గంగాధర్, విష్ణుభక్తుల మురళీధర్, రమాకాంత్, జగదీశ్, గంగారెడ్డి, రాజేశ్వర్, నవ చైతన్య యూత్, ఆజాద్ యూత్ సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు యునీస్ అక్బానీ, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles