15 క్వింటాళ్ల పత్తి దగ్ధం


Sun,November 10, 2019 12:14 AM

తలమడుగు (భీంపూర్) : ఆరబెట్టిన పత్తికి ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న సంఘటన శనివారం తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో చోటుచేసుకుంది. సుమారు 15 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి అయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన రైతు రాజేశ్వర్ తన చేనులో ఏరిన పత్తిని రెండు రోజులుగా ఇంటి ఎదుట ఉన్న రోడ్డుపై ఆరబెడుతున్నాడు. శనివారం కూడా ఎప్పటిలాగే ఆరబెట్టారు. మధ్యాహ్నం సమయంలో నిప్పురవ్వలు వచ్చిపడడంతో పత్తి మొత్తం కాలిపోయింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు వచ్చి ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గ్రామస్తులు నీళ్లు చల్లి మంటలు ఆర్పినప్పటికీ పత్తి మొత్తం కాలిపోయింది. పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందన్న కారణంతో మార్కెట్‌లో గిట్టుబాటు ధరరావడం లేదని ఇంటి వద్ద ఆరబెడితే తనకు ఇలా నష్టం జరిగిందని రైతు రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేను కౌలుకు తీసుకుని కష్టపడి పండించిన పత్తి పంట ఇలా బుగ్గిపాలు అయిందని విచారం వ్యక్తం చేశాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles