సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..


Fri,November 8, 2019 12:42 AM

సిరికొండ : జిల్లాలో నూతనంగా ఏర్పడిన సిరికొండ మండలంలోని సమస్యలను కలెక్టర్, జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి కిషన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ నూతన మండలాలకు ఎంపీడీవో భవనాలను త్వరలో మంజూరు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని నెల 15రోజుల్లో నియమిస్తామని అన్నారు. ఎంపీడీవో కార్యాలయం కోసం మండలంలో సర్పంచులు భూములు ఇవ్వాలని కోరారు. ఇటీవలే నిర్వహించిన 30రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేశారని అన్నారు. అలాగే నిరంతరం పారిశుద్ధ్య, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని జీపీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని సూచించారు. ఎంపీడీవోలు ఉపాధిహామీ గ్రామ సభలను విజయవంతం చేయాలని అన్నారు. ఈనెల 30 వరకు ప్రతి మండలంలో వందశాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలని ఎంపీడీవోలకు, ఉపాధిహామీ సిబ్బందికి సూచించారు. అనంతరం స్థానిక సర్పంచ్, నాయకులు మండల కేంద్రానికి అంబులెన్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని సీఈవోకు వినతి పత్రం అందజేశారు.


మెనూప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి..
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఈవో కిషన్ అన్నారు. మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి పిల్లలకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. పిల్లలు సమాధానం చెప్పడంతో అభినందించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఉపాధ్యాయులకు, కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సూపరింటెండెంట్ సుధాకర్, ఎంపీడీవో రామకృష్ణయ్య, ఎంపీపీ పెందూర్ అమృత్‌రావు, జడ్పీటీసీ కుమ్ర చంద్రకళ, సర్పంచులు పెంటన్న, వర్థరాజ్, ప్రధానోపాధ్యాయులు జె.నారాయణరెడ్డి, జైతు, పాఠశాల కో చైర్మన్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles