నాణ్యమైన పత్తి తెచ్చి మద్దతు ధర పొందాలి


Fri,November 8, 2019 12:41 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డులోకి వచ్చిన పత్తి వాహనాలను తూకం వేసిన అనంతరం జిన్నింగ్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, ఆయా జిన్నింగ్ మిల్లులలో చేరిన పత్తి వాహనాల నుంచి పత్తిని అన్‌లోడ్ చేయించిన 20నుంచి 30నిమిషాల అనంతరం తేమ శాతాన్ని పరిశీలించాలని, 5నుంచి 6సార్లు తేమ శాతం యత్రాంల ద్వారా రీడింగ్ తీసుకొని సరాసరి లెక్కించాలని సూచించారు. రైతులు మార్కెట్ యార్డుకు తీసుకవచ్చే పత్తిని ఆరబెట్టుకొని తీసుకరావాలని తద్వారా మద్ద తు ధర పొందుతారని, విషయాన్ని రైతులు గమనించాలని అన్నారు.


ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనపుడు వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు తెలియజేయాలని సూ చించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు యం త్రాంగం అందుబాటులో ఉంటుందని రైతులకు తెలిపారు. సమస్యలను సృష్టించకుండా నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకరావాలని రైతులకు సూచించారు. అనంతరం వివిధ జిన్నింగ్ మిల్లులను, మార్కెట్ యార్డులోని కాంటాలను కలెక్టర్ పరిశీలించారు. ఎడ్ల బండ్లపై తీసుకవచ్చే పత్తిని త్వరగా పంపించే విధంగా చూడాలని అన్నారు. పశువులకు దాన(ఆహారం) ఏర్పాటు చేశామని రైతులకు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, సబ్ కలెక్టర్ గోపీ, ఆర్డీవో సూర్యనారాయణ, వ్యవసాయశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మల్లేశం, ఉప సంచాలకుడు అజ్మీరా రాజు, సీసీఐ జనరల్ సంజయ్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, మార్కెటింగ్, వ్యవసాయశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles