జిల్లాస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం


Fri,November 8, 2019 12:41 AM

ఎదులాపురం : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అగస్టిన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల, కళాశాల ఆవరణలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన అండర్-14 బాలబాలికలకు ఖోఖో పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జోనల్‌లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనాలన్నారు. పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మంది బాలబాలికలు హాజరయ్యారు. కార్యక్రమంలో రీజినల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్, ఆర్గనైజర్లు ప్రతాప్, సత్యం, పీడీలు హరిచరణ్, కాంతారావు, రాము, కృష్ణ తదితరులు ఉన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles