రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి


Fri,November 8, 2019 12:41 AM

గుడిహత్నూర్ రూరల్ : రైతులు ఆధునిక యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు పొందాలని జాతీయ ఆహార భద్రత మిషన్ సీనియర్ టెక్నికల్ అధికారి ప్రసన్న కుమార్ సూచించారు. మండలంలోని శంభుగూడలో గురువారం గిరిజన రైతులకు జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా కంది పంటపై క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కంది పంటను పరిశీలించారు. సాగు చేసే పద్ధతులను, అం దుతున్న సబ్సిడీ వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పా టు చేసిన సభలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎఫ్ మిషన్ ద్వారా గిరిజన రైతులకు కొత్త వంగడాలు, చిరుధాన్యాలు , నూనె గింజల పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ ద్వారా కేంద్ర పభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం సబ్సిడీ తో రైతులకు ఉచితంగా విత్తనాలు, సంస్థ ద్వారా యాజమాన్య పద్ధతులు అందించి ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ఏటా పంట మార్పిడి చేస్తే దిగుబడి వస్తుందని తెలిపారు. కొన్నేళ్లుగా ఒకే రకమైన విత్తనాలు సాగు చేయడంతో దిగుబడి ఆశించినంత రాదని , ఆధునిక వంగడాలను సాగు చేస్తే దిగుబడి బాగా వస్తుందన్నా రు.


100 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు సరఫరా చేస్తున్నామని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్ మిషన్ హైదారాబాద్ వ్యవసాయ టెక్నికల్ అధికారి రామమోహన్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అందించే ఆధునిక యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. జేడీఏ రమేశ్ మాట్లాడుతూ శంభుగూడ గ్రామానికి ఎన్‌ఎస్‌ఎఫ్ మిషన్ ద్వారా నీమ్ అయిల్ యంత్రాన్ని అందజేస్తామన్నారు. రైతులు యాసంగిలో నూనె గింజల పంటలను సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. నూనె గింజలకు మార్కెట్‌లో మద్దతు ధర కూడా అధికంగా ఉంటుందన్నారు. హార్టికల్చర్ సహకారంతో 90శాతం సబ్సిడీతో గిరిజన రైతులకు స్పింక్లర్లను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమ్రం శంభు, టెక్నికల్ ఏవో లీనా శైలజ, టెక్నికల్ అసిస్టెంట్లు కృష్ణవేణి, ముకేశ్, గ్రామపటేల్ కుమ్ర నాగు, భారత్, దేవిదాస్, గోపాల్, భీమ్‌రావు, మారుతి, జంగు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles