ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి


Fri,November 8, 2019 12:41 AM

ఎదులాపురం : మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకొని ప్రశాంత జీవనాన్ని గడపాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఆసిఫాబాద్ నుంచి గత నెల 30న ప్రారంభమైన యాత్ర గురువారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. రాంనగర్‌లోని హనుమాన్ ఆలయం నుంచి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులందరికీ చైర్మన్, ఎమ్మెల్యే జోగురామన్న స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయకొట్టి పల్లకీ ఊరేగింపు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను వీడి మంచి ఆలోచనలతో జీవితానికి బాటలు వేసుకోవాలన్నారు. 18 ఏండ్లుగా కార్తీకమాసంలో పండరీపూర్ యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సమయంలో యాత్రలో పాల్గొనే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించానన్నారు.


ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని విఠలేశ్వరుని ప్రార్థిస్తున్నామన్నారు. చెడు వ్యసనాలు తొలగిపోయి కుటుంబాలు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నారు. 450 మంది భక్తులకు రైల్వే టికెట్లను జడ్పీ చైర్మన్ ఇచ్చారని, దుర్గం ట్రస్టు చైర్మన్ దుర్గం శేఖర్ వంద మంది భక్తులకు రైల్వే టికెట్ల ప్రయాణ ఖర్చులు ఇవ్వడం అభినందనీయమన్నారు. జీఎస్‌ఆర్ ట్రావెల్స్ అధినేత ప్రమోద్‌కుమార్ ఖత్రి, యాత్రికులకు 50 చీరలు పంపిణీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో చైతన్య సాంప్రదాయక్ ముఖ్య ప్రచార్ కర్త తుకారాం మహరాజ్, దుర్గం ట్రస్టు చైర్మన్ దుర్గం శేఖర్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అడ్డి భోజారెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రయాణికులతో బయలుదేరిన జడ్పీ చైర్మన్ దంపతులు
పండరీపూర్ యాత్రకు భక్తులతో కలిసి జడ్పీ చైర్మన్ దంపతులు రైలులో బయలుదేరారు. రైల్వేస్టేషన్‌లో రైలుకు పూజ చేసి దుర్గానగర్ మహరాజ్ కిషన్ జెండా ఊపి రైలు యాత్ర కొనసాగించారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles