న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా ప్రసాద్


Wed,November 6, 2019 11:44 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా కె.ప్రసాద్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా ఉదయ భాస్కర్‌రావు ఇన్‌చార్జిగా ఉన్నారు. బెల్లంపల్లిలో ప్రథమ శ్రేణి న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న కె.భాస్కర్‌కు ప్రభుత్వం సీనియర్ సివిల్ జడ్జిగా ఉద్యోగోన్నతి కల్పించి, ఆదిలాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి కె.ప్రసాద్ ఉదయ భాస్కర్‌రావు నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయసేవా అధికార సంస్థను సంప్రదించి న్యాయం పొందాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles