అమ్మఒడి పైలట్‌కు రాష్ట్రస్థాయి అవార్డు


Wed,November 6, 2019 11:44 PM

ఎదులాపురం/బోథ్, నమస్తే తెలంగాణ: బోథ్‌కు చెందిన అమ్మఒడి (102 వాహనం) పైలట్ అర్ష స్వామికి రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. బుధవారం ఆదిలాబాద్‌లోని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో తొడసం చందు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గర్భిణులను ఎప్పటికప్పుడు పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి దవాఖానలకు తరలించడంలో ఉత్తమ సేవలందించినందుకు గాను స్వామిని ఈ అవార్డు వరించింది. కార్యక్రమంలో జిల్లా సమన్వయ కర్త శశికాంత్, ప్రాజెక్టు మేనేజర్ విజయ్‌కుమార్, ఎస్‌సీ జనార్దన్ పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles