వ్యర్థాల నిర్వహణకు మూడు గ్రామాల ఎంపిక


Tue,October 15, 2019 01:16 AM

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద 97 గ్రామాలను ఎంపిక చేయగా.. జిల్లాలోని మోడల్ గ్రామాలుగా ఆదిలాబాద్ మండలం వాన్‌వాట్, బోథ్ మండలం సోనాల, మావల ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లో ఇండ్లలోని వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. మావలలో 532 కుటుంబాలు, సోనాలలో 1040 కుటుంబాలు, వాన్‌వాట్‌లో 159 కుటుంబాలు ఉండగా.. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణకు ఆయా కుటుంబాలకు రెండు చెత్తబుట్టల చొప్పున పంపిణీ చేస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది రోజూ ప్రతి ఇంటికీ తిరిగి వేర్వేరుగా తడి, పొడి చెత్తను సేకరిస్తారు. చెత్త సేకరణలో ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీకి రిక్షాలను అందుబాటులో ఉంచుతారు.


పంచాయతీ సిబ్బందికి గ్లౌజ్‌లు, బూట్లను పంపిణీ చేస్తారు. గ్రామాల్లో ఇండ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు. డంపింగ్ యార్డుల్లో ఈ చెత్తలను వేర్వేరుగా నిల్వ చేసేందుకు రెండు షెడ్లను నిర్మిస్తారు. తడిచెత్త ద్వారా కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడంతో పాటు పొడి చెత్తను రిసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles