ముమ్మరంగా డంపింగ్‌యార్డు పనులు


Mon,October 14, 2019 03:12 AM

భీంపూర్ : 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఒక్కొక్కటి వేగంగా పూర్తవుతున్నాయి. తాంసి, భీంపూర్ మండలాల్లోని 39 పంచాయతీల్లో అనుబంధ గ్రామాల్లో డంపింగ్‌యార్డు నిర్మాణాలు చేపట్టారు. ప్రతీ కుటుంబం పరిసరాల శుభ్రత పాటించేలా అధికారులు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్మికులు జీపీ కేంద్రాలు, అనుబంధ గ్రామాల్లో చెత్త సేకరణ రిక్షాల్లో చెత్తను తీసుకొని గ్రామ శివారులోని డంపింగ్‌యార్డులో వేస్తున్నారు. దీంతో గ్రామ పరిశుభ్రతతో ఆరోగ్యకర వాతావరణం నెలకొంటున్నది. ఆయా గ్రామాల్లో అక్కడి భూమి స్వభావాలనుబట్టి డంపింగ్‌యార్డుల లోతు, పొడవు, వెడల్పులను ఇంజినీర్లు మార్కవుట్ చేయగా సర్పంచులు, కమిటీల అధ్యక్షులు పనులు వేగంగా పూర్తిచేయిస్తున్నారు. ఇప్పటికే భీంపూర్ మండలం కామట్‌వాడ డంపింగ్‌యార్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. సర్పంచ్ తాటిపెల్లి లావణ్య, జడ్పీటీసీ రాజు నిత్యం ఈ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. పిప్పల్‌కోటి, అంతర్గాం, తాంసి, కప్పర్ల, ఇందూర్‌పల్లి తదితర గ్రామాల్లో డంపింగ్‌యార్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles