సాఫీగా ప్రయాణం


Sat,October 12, 2019 12:24 AM

-పెరిగిన బస్సులు,ఇతర వాహనాలు
-శుక్రవారం అందుబాటులో 187 వాహనాలు
-ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు


ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, రవాణాశాఖ, పోలీసు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఏడు రోజులుగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వివిధ శాఖల నుంచి ఆర్టీసీకి నలుగురు అధికారులను కేటాయించారు. వీరితో పాటు వీఆర్వోలు బస్టాండ్‌లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు అధికారులతో చర్చించి బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తుండడంతో పండుగలకు వచ్చిన వారితో పాటు తమ పనుల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలు గ్రామాలకు పోయే వారి ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్లు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా అధికారులు చార్జీల పట్టికలను బస్సుల్లో అందుబాటులో ఉంచారు. ఎక్కువ డబ్బులు తీసుకున్న వారిపై ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబరును సైతం బస్సుల్లో అతికించారు. తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుంటున్న ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. ప్రైవేటు వాహనాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా రోడ్డు రవాణా సౌకర్యం రోజు, రోజుకూ మెరుగుపడుతున్నది.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles