సీఎం దిశానిర్దేశం


Fri,October 11, 2019 03:58 AM

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్, డీపీవో, డీఎల్‌పీవో, ఎంపీవో, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లకు గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. దీన్ని స్ఫూర్తిగా కొనసాగించడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సీఎం ప్రకటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన ఊరిని మనమే శుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని తెలిపారు. గ్రామాలు బాగుపడాలనే లక్ష్యంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రతినెలా గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లను విడుదల చేస్తామని, గ్రామ పంచాయతీలకు సమకూరే ఆదాయానికి అదనంగా ఉంటుందని తెలిపారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, నర్సరీల ఏర్పాటుకు స్థలాలను గుర్తించడం జరిగిందని, మిగతా వాటికి సైతం భూములను గుర్తించాలని సూచించారు. పవర్‌వీక్ కార్యక్రమంలో భాగంగా విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో కరెంటుకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో మొక్కలను పెంచి పచ్చదనం పెంపొందించాలని సూచించారు.


రూ.2 కోట్లు మంజూరు...
గ్రామాల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, ఇతర పనులకు కలెక్టర్ పరిధిలో రూ.2 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పల్లెలు మరింత ప్రగతి బాటలో ప్రయాణించనున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల గ్రామస్తులు శ్రమదానంతో పిచ్చిమొక్కలను తొలగించడం, మురికి కాల్వలను శుభ్రం చేయడం, తుమ్మలు, పెంటకుప్పలు తొలగించడం, బురదమయంగా ఉన్న రోడ్లను బాగు చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు గ్రామస్తుల శ్రమదానంతో పల్లెలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles