రైతులకు అందుబాటులో ఉంటాం


Fri,October 11, 2019 03:57 AM

ఇచ్చోడ : రైతులకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా తనవంతు కృషి చేస్తానని ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్‌పర్సన్ రాథోడ్ అశ్విత అన్నారు. గురువారం మార్కెట్ కార్యాలయంలో అశ్వితతో పాటు వైస్ చైర్మన్ కుడిమెత జంగు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పంటల క్రయ, విక్రయాల సందర్భంగా మార్కెట్ వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులను కల్పిస్తానని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం సిబ్బంది నూతన సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల టీఆర్‌ఎస్ మండల కన్వీనర్లు పాట్కూరి శ్రీనివాస్‌రెడ్డి, కరాడ్ బ్రహ్మానంద్, ఏనుగు కృష్ణారెడ్డి, అంబేకర్ పాండురంగ్, రాథోడ్ ప్రకాశ్, అబ్దుల్ రషీద్, దాసరి భాస్కర్, వెంకటేశ్, అబ్దుల్ బషీర్, బాలాజీ, సుభాష్ పాటిల్, సూర్యకాంత్ చౌహాన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి రమేశ్, సూపర్‌వైజర్ ఆజాం, సాయి టీఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles