కుప్టికి త్వరలో మోక్షం


Fri,September 20, 2019 02:19 AM

-అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం కేసీఆర్
-ప్రాజెక్టు నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి
-త్వరలో నెరవేరనున్న ప్రజల కల
-హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు


నేరడిగొండ : బోథ్ నియోజకవర్గ ప్రజల దశాబ్ద కాలం కల.. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నోట మళ్లీ ప్రాజెక్టు నిర్మాణం తథ్యమని చెప్పడం.. కుప్టి ప్రాజెక్టు నిర్మాణం పక్కా అని చెప్పవచ్చు. మండలంలోని కుప్టి గ్రామం వద్ద సమీపంలో కడెం వాగుపై నిర్మించనున్న కుప్టి ప్రాజెక్టుకు త్వరలో మోక్షం కలుగనుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ప్రాజెక్టు విషయం ప్రస్తావనకు రావడం జరిగింది. సాగునీరు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణాలపై గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలోని కుప్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామన్నారు.

ఎందుకంటే నియోజకవర్గ ప్రజల కల ఈ ప్రాజెక్టు కావడం, అసెంబ్లీలో ప్రాజెక్టు విషయంలో చర్చ జరగడం, ముఖ్యమంత్రి నోట ప్రాజెక్టు నిర్మాణం త్వరలోనే చేపడతామని చెప్పడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ప్రజలు ప్రాజెక్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన సర్వేలు పూర్తి చేయగా, నిధుల ఖర్చును కూడా ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి నోటి నుంచి కుప్టి ప్రాజెక్టు మాట వచ్చిందంటే అది తప్పకుండా జరిగి తీరుతుందని ఈ ప్రాంత ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles