రైతులు అధైర్యపడవద్దు


Fri,September 20, 2019 02:15 AM

బేల : రైతులు అధైర్యపడవద్దని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పత్తి పంటకు అధిక వర్షాలకు వేరు వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉందని దానికి కాపర్ హైట్రిక్ క్లోరైడ్‌ను వేర్లకు పిచికారీ చేసుకుంటే వేరు వ్యవస్థ బలపడుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఆశకుమారి అన్నారు. గురువారం బేల మండలంలోని సైద్‌పూర్, తోయగూడ, సాంగ్వీ తదితర గ్రామాల్లోని పత్తి పంటలను పరిశీలించారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో బేల, జైనథ్ మండలాలకు చెందిన పత్తి పంటలు నెలకొరిగాయన్నారు. వ్యవసాయశాఖ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. రైతులతో మాట్లాడి పంట పరిస్థితితో పాటు నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం అధిక వర్షాలకు పత్తి పంట నేలకొరిగిందని, భూమిలో తేమ ఎక్కువగా ఉందని వేరు వ్యవస్థ కుళ్లిపోయే ప్రమాదం ఉన్నందున సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతులందరూ బ్యాంక్ ద్వారా కానీ ప్రైవేట్‌గా ఇన్సురెన్స్ చేసుకుంటే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని నష్టం వివరాలను అధికారులకు తెలియజేస్తామన్నారు. వ్యవసాయాధికారిణి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆరె రాజన్న, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, అడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, టీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌రెడ్డి, ఎంపీడీవో మహేందర్‌కుమార్, నాయకులు దత్తు, రోహిదాస్, చరణ్‌సింగ్, మండల వ్యవసాయ శాఖ అధికారి దౌలత్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles