సోంపల్లిలో వైద్యుల విచారణ


Thu,September 19, 2019 12:49 AM

సిరికొండ: మండలంలోని సోంపల్లికి చెందిన బుస్సవాడే సోనే అనే మహిళ గర్భవతి కాకున్నా గర్భవతి అయినట్లు ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు నిర్ధారించారు. తీరా తొమ్మిది నెలలు నిండినా ప్రసవం కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు వైద్యులపై ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా డిప్యూటీ వైద్యురాలు సాధన గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన సోనే అనే మహిళ గర్భిణి కాకున్నా గర్భిణిగా ఉన్నట్లు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు నిర్ధారించారని, ప్రతి నెలా అదే దవాఖానలో వైద్యపరీక్షలు నిర్వహించారని పేర్కొన్నారు. తొమ్మిది నెలలు నిండినా ప్రసవం కాలేదు. దీంతో అనుమానం వచ్చి నిర్మల్ దవాఖానలో వైద్యపరీక్షలు చేయించారు. సోనే గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని, శిశువు లేదని తేల్చడంతో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. అధికారి వెంట వైద్యురాలు హిమ బింధు, నవ్య, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles