ఓటర్లు వివరాలను సరి చూసుకోవాలి


Thu,September 19, 2019 12:48 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఓటర్లు తమ వివరాలను ఓటరు జాబితాలో సరి చూసుకోవాలని ఇందుకు ప్రత్యేక సంక్లిప్త సవరణ కార్యక్రమాన్ని వచ్చే నెల 15వరకు నిర్వహించనున్నట్లు మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్ల వివరాలు ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి మంచి అవకాశమని అన్నారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లకు ఈ విషయాన్ని తెలియజేసి ఎన్‌వీఎస్‌పీ పోర్టల్, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో, కామన్ సర్వీస్ సెంటర్‌లో సరి చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ మధుసూదన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ప్రభాకర్, నాయబ్ తహసీల్దార్ మహేశ్, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles