బీజేపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితం


Tue,September 17, 2019 02:35 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రైతులను సంఘటితంగా చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసేందుకు రైతు సమన్వయ సమితులను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తే బీజేపీ నాయకులు సమన్వయ సమితులు ఉత్సవ మూర్తులంటున్నవారి మాటలు అర్థరహితంగా ఉన్నాయని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ భోజారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే జోగు రామన్న నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఆయన మాట్లాడారు. ఎన్నడూలేని అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. అనాలోచిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. అవగాహన లేకపోతే మా వద్దకు ట్యూషన్ వస్తే నేర్పిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ప్రాజెక్టుల నిర్మాణం, ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇంతటి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులకు విమర్శించే హక్కు లేదని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. సోయా, పత్తి, వరి, ఇతర పంటలకు కనీసం మద్దతు ధర పెంచలేదని ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ రాష్టంలో రైతులను సంఘటితం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యానికి మద్దతు ధర కోసం రైతు సమన్వయ సమితులు అండగా ఉంటాయన్నారు. బీజేపీ నాయకులు.. రైతులను తప్పుదోవ పట్టించడానికే తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రైతులతో రాజకీయాలు చేసిన నాయకులు ఎప్పటికీ బాగుపడరని, అందుకే బీజేపీ నాయకుడు పాయల శంకర్ ఉత్సవ విగ్రహంగా ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దీనికి నిదర్శనం పక్కరాష్ట్రంలోని మహారాష్ట్ర నుంచి రైతులు తమ పంటను విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆరోపణలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, మాజీ కౌన్సిలర్లు అశోక్ స్వామి, బాదన్ గంగన్న, ఖదీర్, ఖయ్యూం, పలువురు నాయకులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles