లోక్ అదాలత్‌లో 21ట్రాఫిక్ కేసుల పరిష్కారం


Mon,September 16, 2019 12:30 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో ట్రాఫిక్‌కు సంబంధించిన 21 కేసులు పరిష్కారం అయినట్లు ట్రాఫిక్ సీఐ పి.గంగాధర్ తెలిపారు. ప్రమాదాలను నివారించడానికి పట్టణంలో పలు కూడళ్ల వద్ద స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 21 డ్రంకెన్‌డ్రైవ్ కేసులను పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్‌లో పెట్టగా ఒక్కో కేసుకు వెయ్యి రూపాయల చొప్పున నిందితులకు న్యాయమూర్తి జరిమానా విధించారని వివరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. గతంలో కంటే ప్రస్తుతం నిబంధనలు కఠినతరం అయ్యాయని ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని సూచిం చారు. వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్‌నెస్ తదితర అన్ని ధ్రువపత్రాలు ఉంచుకోవాలని సూచించారు. తనిఖీల్లో పట్టుబడితే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles