ఉట్నూర్ ఫారెస్ట్ ఇన్‌చార్జి సెక్షన్ అధికారి సస్పెన్షన్


Mon,September 16, 2019 12:30 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: ఒక వైపు ప్రభుత్వం అడవులను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుంటే.. కొందరు అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. అటువంటి వారిపై విచారణ చేపట్టి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విధులో అక్రమాలకు పాల్పడుతున్న ఉట్నూర్ ఫారెస్ట్ ఇన్‌చార్జి సెక్షన్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని శాంతినగర్‌లో కొత్తగా చేపట్టిన ఓ ఇంటి నిర్మాణం విషయం తెలుసుకొని జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రభాకర్ ఆదేశాల మేరకు డివిజన్ అధికారి చంద్రశేఖర్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఆ ఇంటికి బిగించేందుకు అక్రమంగా సిద్ధం చేసుకున్న రూ. 60 వేల విలువచేసే కలప దొరికింది. కలపకు సంబంధించిన ఎటువంటి పత్రాలూ లేవని అధికారులు నిర్దారించారు. యజమానిని వివరణ కోరగా.. ఉట్నూర్ ఫారెస్ట్ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సెక్షన్ అధికారి అజ్మీరా నరేశ్ డబ్బులు తీసుకొని తమకు అనుమతి పత్రం ఇవ్వలేదని వివరించారు. దీనిపై యజమాని లిఖిత పూర్వకంగా ఫిర్యాదును అందజేసినట్లు అధికారులు తెలిపారు. కలప అక్రమ రవాణాతో పాటు గృహా నిర్మాణదారులకు సెక్షన్ అధికారి నరేశ్ సహకరిస్తున్నాడని పక్కా సమాచారం ఉండడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles