రచనలతో సమాజంలో చైతన్యం తేవాలి


Mon,September 16, 2019 12:29 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: సమాజంలో నెలకొన్న సమస్యలను ఎలుగెత్తుతూ, ప్రజలు సన్మార్గంలో నడిచేలా కవులు తమ రచనలతో చైతన్యం తేవాలని ప్రముఖ కవి, తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కార గ్రహీత సబ్బని లక్ష్మీనారాయణ, కైతికాల రూపకర్త గోస్కుల రమేశ్ పిలుపునిచ్చారు. కుమ్రం భీం ప్రాంగణంలోని బీఈడీ కళాశాలలో ఆదివారం ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షుడు కొండగొర్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కవి ఆత్రం మోతీరాం రచించిన కైతికాలు దండారి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో కవులు ప్రతిభ చాటేలా ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ఆదివాసీ ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంపై దండారి శీర్శికతో ఆత్రం మోతీరాం రచనలు చేసి పుస్తకం ఆవిష్కరించడం కొలాం సమాజం గర్వించదగ్గ విషయమన్నారు. పుస్తకావిష్కరణకు తోడ్పాటు అందించిన కానిస్టేబుల్ దుర్వ సంతోష్‌ను ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గోపగాని రవీందర్, మెస్రం మనోహర్, మర్సకోల తిరుపతి, బంకట్‌లాల్, సహాయ కర్త దుర్వ సంతోష్, శ్రావణ్, వెడ్మబొజ్జు, ఈశ్వరీబాయి, మర్సకోల సరస్వతి, కవులు, కళాకారులు భాస్కర్, రాథోడ్ భీంరావు, సిడాం గంగాధర్, లాల్‌షావు, మాణిక్‌రావు, రాజేశ్వర్, ఆత్రం సుగుణ పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles