జోనల్ స్థాయి పోటీలకు బోథ్ కేజీబీవీ విద్యార్థులు


Sat,September 14, 2019 11:52 PM

బోథ్, నమస్తే తెలంగాణ : జోనల్ స్థాయి కరాటే పోటీలకు బోథ్‌లోని కేజీబీవీ, వేదం పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారు. శనివారం ఆదిలాబాద్‌లో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. కేజీబీవీ పాఠశాలకు చెందిన జే సునీత, ఆర్ కళ్యాణి, కే సుశీల, టి రేణుబాయి, వేదం పాఠశాలకు చెందిన కే అనన్య ఎంపికయ్యారు. వీరితో పాటు ఇచ్చోడ కేజీబీవీకి చెందిన యు అంజలి, జే మనీష, జి వైష్ణవి ఎంపికైనట్లు మాస్టర్లు సెడ్మకి సురేశ్, లాడేవార్ రాజేశ్వర్ తెలిపారు.


ఇచ్చోడ కస్తుర్బా విద్యార్థులు...
ఇచ్చోడ : జోనల్ స్థాయి కరాటే పోటీలకు ఇచ్చోడ కస్తుర్బాగాంధీ బాలికల పాఠశాలకు ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు. శనివారం ఆదిలాబాద్‌లో ఎంపిక పోటీలను నిర్వహించగా 8, 9వ తరగతి విద్యార్థినులు యూ అంజన, జే మనీషా, జీ వైష్ణవి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. జోనల్ స్థాయి కరాటే పోటీకి ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్ మల్లిక, కరాటే మాస్టర్లు ఎస్ సురేశ్, ఎల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles