చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి


Sat,September 14, 2019 11:51 PM

నేరడిగొండ : మండలంలోని గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని అసిస్టెంట్ కలెక్టర్, నేరడిగొండ మండల ప్రత్యేకాధికారిని అభిలాష్ అభినవ్ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. శనివారం నేరడిగొండ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో అసిస్టెంట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారిణి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఉండేలా చూడాలని, ఉన్న వాటిలోనే చెత్తను వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో స్థలం లేనిచోట ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంటలను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు చెప్పాలన్నారు. లేదంటే కంపోస్టు ఫీట్స్ నిర్మించి ఇవ్వాలని, దీంతో రైతుకు సేంద్రియ ఎరువు తయారు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. ఇవన్నీ 30 రోజుల ప్రణాళికలో పూర్తయ్యేలా చూసుకోవాలని చెప్పారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారిని స్వప్నశీల, ఈజీఎస్ ఏపీవో సల్ల మంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles