డిప్లొమా కోర్సుల్లో ఉచిత శిక్షణ

Sat,September 14, 2019 12:49 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువతి, యువకులకు జనరల్ నర్సింగ్ మిడ్ వైపరి(జీఎన్‌ఎం), ల్యాబ్ టెక్నీషియన్(డీఎంఎల్‌టీ), ఆప్తాల్మిక్ టెక్నిషియన్ డిప్లొమా కోర్సులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి గోపి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న యువత ఈనెల 21లోగా ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమశాఖ ఉట్నూర్ కార్యాలయం, డీటీడీవో, ఏటీడీవో కార్యాలయంలో సాయంత్రం 5 లోగా బయోడేటా, అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు సమర్పించాలన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles