పత్తిలో శనగపచ్చ పురుగును నివారించాలి

Sat,September 14, 2019 12:49 AM

ఉట్నూర్ రూరల్ : పత్తి పంటలో శనగపచ్చ పురుగును నివారించాలని ఏఈవో వినయ్‌కుమార్, దేవేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని సాకెర(బి) గ్రామంలో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి పంటలో శనగపచ్చ పురుగు ఉధృతిని గమనించామన్నారు. పురుగు లార్వాలు మొగ్గ, పిందె కాయలను తొలచి అపార నష్టాన్ని కలిగిస్తాయని అన్నారు. కాయలపై గుండ్రటి రంధ్రం ఏర్పడుతుందని అన్నారు. దీని నివారణకు థయోడికార్బ్( మార్కెట్‌లో లార్విస్ పేరుతొ లభిస్తుందని) 1.5గ్రాములు లేదా ట్రైఅజోఫాస్ ( మార్కెట్‌లో జోష్ పేరుతో దొరకుతాయి) 2మిలీ లేదా ఫ్లుబెండామైడ్( మార్కెట్ లో ఫేమ్ పేరుతో దొరుకుతుంది) 0.3మిలీ లేదా ఏమా మెక్టిన్ బెంజోయేట్ 0.5 మి.లీ (మార్కెట్‌లో మిసైల్ పేరుతో లభిస్తాయి) లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. రైతులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles