పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

Sat,September 14, 2019 12:48 AM

నార్నూర్/గాదిగూడ : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోనే ఆరోగ్యంగా ఉంటామని ఉట్నూర్ ఆర్డీవో వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిప్రి, సావ్‌రీ, లోకారి(కే) గ్రామాల్లో పర్యటించారు. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తీసివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అపరిశుభ్రతతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను తప్పనిసరిగా నిర్మించుకోవాలని స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కనక యాదవ్‌రావ్, జడ్పీటీసీ మెస్రం గంగుబాయి సోంజీ, సర్పంచ్ మెస్రం దేవ్‌రావ్, మాజీ సర్పంచ్ జాకు. భగవాన్‌కాంబ్లే, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles