15న కైతికాలు దండారి పుస్తకావిష్కరణ

Sat,September 14, 2019 12:48 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : మండల కేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఈనెల 15 ఆదివారం కైతికాలు దండారి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ సాహితీ వేదిక వ్యవస్థాపకులు మెస్రం మనోహర్ అన్నారు. శుక్రవారం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్రం మోతీరాం రచించిన కైతికాలు దండారి పుస్తకంలో ఆదివాసీల చరిత్ర సంబంధించిన విషయాలు పొందుపర్చారన్నారు. చిన్న కవితలతో ప్రారంభించిన కొలాం కవి ఆత్రం మోతీరాం నేడు పుస్తక రచన స్థాయికి ఎదగడం సంతోషకరం అన్నారు. కైతికాల సృష్టికర్త గోస్కుల రమేశ్, తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కార గ్రహీత సబ్బని లక్ష్మీనారాయణ, ఉట్నూర్ సాహితీ వేదిక వ్యవస్థాపకుడు గోపగాని రవీందర్ వస్తున్నారన్నారు. కవులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో లక్కారం మాజీ సర్పంచ్ మర్సకోల తిరుపతి, ఉసావే అధ్యక్షుడు కొండగొర్ల లక్ష్మయ్య, కవులు బంకట్‌లాల్, ఆత్రం మోతీరాం, కుమ్ర లాల్‌షావు తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles