చేనేత హస్తకళకు ప్రభుత్వ ప్రోత్సాహం

Sat,September 14, 2019 12:48 AM

ఎదులాపురం : రాష్ట్ర ప్రభుత్వం చేనేత హస్తకళకు ప్రోత్సాహం అందిస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్యాణ మండపంలో అఖిల భారత హస్తకళా చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లోని వస్తువులు, వస్ర్తాలను అతిథులు తిలకించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉపాధి కోసం దసరాకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందన్నారు. కార్మికులకు రుణాలు సైతం ఇస్తుందన్నారు. చేనేత వస్ర్తాలను ధరించాలని జడ్పీ చైర్మన్ పిలుపునిచ్చారు. చేనేత దుస్తులను ఆయన కొనుగోలు చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వాహకులు అతిథులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, సామాజిక కార్యకర్త దేవన్న, చేనేత వస్త్ర ప్రదర్శనశాల అధ్యక్షుడు సుఖేందర్, కార్యదర్శి ప్రసాద్‌రావు, సభ్యులు నిఖిల్, విక్రమ్, బాలాజీ పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles