ప్రతిభను వెలికి తీసేందుకే స్వచ్ఛ్ పక్వాడా

Sat,September 14, 2019 12:47 AM

ఎదులాపురం : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు స్వచ్ఛ్ పక్వాడా ఎంతో దోహదపడుతుందని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్వచ్ఛ్‌పక్వాడా కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థ రహిత భారతదేశం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఈ నెల 16న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఎనిమిది మంది ఉపాధ్యాయులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సెక్టోరియల్ అధికారి కంటె నర్సయ్య, సత్యనారాయణ, లక్ష్మణ్, రవికాంత్, భూపతి, శ్రీనివాస్ ఉన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles