ముగిసిన నామినేషన్ల పర్వం

Tue,March 26, 2019 12:07 AM

- చివరి రోజు కోలాహాలం..
- 16 మంది నామినేషన్ల దాఖలు
- 16 మంది అభ్యర్థులు..27 సెట్ల నామినేషన్లు nనేడు పరిశీలన

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా సోమవారంతో గడువు ముగిసింది. మొత్తం 16 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు అందజేశారు. చివరి రోజు 16 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లు ఎక్కువ సంఖ్య లో నామినేషన్ల వేసేందుకు రాగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం పరిసరాలు కోలాహలంగా మారాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి గొడాం నగేశ్ నాలుగు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్,మూడుసెట్లు, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

చివరి రోజు 16 మంది నామినేషన్లు
చివరి రోజు సోమవారం టీఆర్‌ఎస్ అభ్యర్థి గొడాం నగేశ్ నాలుగు సెట్లు, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు రెండు సెట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి బుక్యా గోవింద్ రెండు సెట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ తరపున ఒక సెట్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జాదవ్ నరేశ్, స్వతంత్ర అభ్యర్థులు గంట పెంటన్న, నేతావత్ రాందాస్, కుమ్ర రాజు, జాదవ్ నరేశ్, ఆరే ఎల్లన్న ఒక్కో సెట్, రాష్ట్రీయ జనక్రాంతిపార్టీ అభ్యర్థిగా పవార్ కృష్ణ, జనసేన పార్టీ అభ్యర్థిగా ధారావత్ నరేందర్, భారతీయ బహుజన్ క్రాంతి దళ్ పార్టీ తరపున ఆడే బాలాజీ, నవ ప్రజారాజ్య పార్టీ అభ్యర్థిగా కుమ్ర వందన, సమాజ్‌వాదీ ఫార్వడ్ బ్లాక్ అభ్యర్థిగా లకావత్ విజయ్‌కుమార్ నామినేషన్లు వేశారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రావడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వంద మీటర్ల దూరం వాహనాలు, కార్యకర్తలను నిలిపివేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనికి ఐదుగురు అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులు,వాహనాలను వీడియో చిత్రీకరణ చేశారు. నామినేషన్ల పరిశీలన నేడు జరుగనుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

111
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles