పంచాయతీలకు నిధుల వరద

Tue,March 26, 2019 12:06 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు భారీగా నిధు లు మంజూరు చేశాయి. 2011 జనాభా ప్రాతిపదికన పంచాయతీలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా నిధులు విడుదలయ్యా యి. జిల్లా జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థలకు కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ ఎస్సీ కంపోనెంట్, ఎస్టీ స్పెషల్ కంపోనెంట్ (టీఎస్‌పీ) నిధులు కూడా విడుదలయ్యాయి. 2018-19 కేటా యింపుల్లో భాగంగా రెండో విడ త బేసిక్ గ్రాంట్ కింద ఈ నిధులను పంచాయతీ ల్లో ఖర్చు చేసేందుకు మంజూరు చేసినట్లు ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పంచాయతీ ప్రణాళికకు అనుగుణంగా ఆయా ఖాతాల్లో జమ చేయాలని డీపీవోలకు సూచించింది. నాలుగు రకాల నిధులు కలిపి ఉమ్మడి జిల్లాకు రూ.56.93కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులను త్వరలో పంచాయతీ ఖాతాల్లో జమ చేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లాకు రూ.56.93కోట్లు..
ఆదిలాబాద్ జిల్లాలో 467 పంచాయతీలు, నిర్మల్‌లో 396, మంచిర్యాలలో 311, కొమురంభీం (ఆసిఫాబాద్) జిల్లాలో 334 పంచాయతీలు ఉ న్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 1508 పంచాయతీలు ఉండగా.. ఈ పంచాయతీలకు 2018-19సంవత్సరానికి గాను రెండో విడత కిం ద రూ.56.93కోట్లు మంజూరు చేశారు. నాలుగు జిల్లాలకు వివిధ గ్రాంట్ల వారీగా మంజూరైన నిధు లు పరిశీలిస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 52.03 కోట్లు, సాధారణ నిధులు రూ.38.98లక్షలు ఎస్సీ కంపోనెంట్ నిధులు రూ.2.22కోట్లు, ట్రైబల్ స్పెషల్ కంపోనెంట్ నిధులు రూ.2.33 కోట్లు మంజూరయ్యాయి. టీఎస్‌పీ నిధులు నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాకు అధికంగా మంజూ రయ్యా యి. సాధారణ నిధులను అన్ని పంచాయతీల్లో ఖర్చు చేయగా.. ఎస్సీ కంపోనెంట్ నిధులు 40 శా తం ఎస్సీ జనాభా దాటిన పంచాయతీల్లో, 40 శాతం ఎస్టీ జనాభా దాటిన పంచాయతీల్లో ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వాలు విడుదల చేసిన ఈ నిధులు సర్పంచ్‌లకు మొదటి సారిగా వినియోగంలోకి రానున్నాయి. బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఈ నిధులు మంజూరు కావడంతో సర్పంచుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

తొలిసారి వినియోగం..
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలు గు రకాల నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభు త్వం నుంచి విడుదలయ్యే 14వ ఆర్థిక సంఘం ని ధులు 2015నుంచి నేరుగా పంచాయతీలకు విడుదలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు స్పెషల్ కంపోనెంట్ నిధులు పంచాయతీలకు సమకూరుతున్నాయి. జనరల్ ఫండ్ నిధులు కూడా పంచాయతీలకు జమ అవుతున్నాయి. ఈ నాలుగు రకాల ఆదాయ వనరులు కాకుండా పంచాయతీలకు ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయి. పంచాయతీ పరిధిలో వసూలు చేసే ఇంటి, నల్ల పన్నులు, భూములకు సంబంధించిన వ్యవహారాల్లో వసూలు చేసే నిధులు, ఇసుక ద్వారా వచ్చే ఆదాయం తదితర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం పంచాయతీ ఖాతాల్లో జమ అవుతుంది. ఈ నిధులను నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాల్సి ఉంటుంది.

82
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles