తేలిన ఓటర్ల లెక్క

Tue,March 26, 2019 12:06 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లాలో 20,78,352 మంది ఉన్నట్లు తేలింది. అసెంబ్లీ ఎన్నికలకంటే ఈసారి ఓటర్లు గణనీయంగా పెరిగారు. 18-19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కొత్త ఓటర్లు ఉమ్మడి జిల్లాలో 51,784 మంది నమోదు చేసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 6,72,705 మంది ఓటర్లుండగా.. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4,02,663 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మంచిర్యాల నియోజకవర్గంలో 2,50,211 మంది ఓటర్లుండగా.. అత్యల్పంగా బెల్లంపల్లి సెగ్మెంట్‌లో 1,64,275 మంది ఓటర్లు ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20,78,352 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఉమ్మడి జిల్లాలో 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల వారు కొత్తగా 51,784 మంది ఓటును నమోదు చేసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 6,72,705 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,24,917 మంది పురుషులు, 3,47,754 మంది మహిళలు, 34 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు మధ్య వారు 19,112 మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4,12,985 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 2,03,321 మంది పురుషులు, 2,09,654 మంది మహిళలు, 10 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల వారు 9620 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో 5,89,999 మంది ఓటర్లుండగా.. ఇందులో 2,96,461 మంది పురుషులు, 2,93,498 మంది మహిళలు, 40 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు మధ్య గల వారు 13,196 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4,02,663 మంది ఓటర్లుండగా.. ఇందులో 2,01,995 మంది పురుషులు, 2,00,656 మంది మహిళలు, 12 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 9856 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మంచిర్యాల నియోజకవర్గంలో 2,50,211 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,64,275 మంది ఓటర్లు ఉన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles