ఉపాధికి ఊతం..!

Mon,March 25, 2019 12:25 AM

- ఉమ్మడి జిల్లాలో జోరుగా ఉపాధి పనులు
- ఆర్థిక సంవత్సరంలో రూ.326.47కోట్ల వ్యయం
- కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టి
- కూలి డబ్బులు అదనంగా చెల్లించాలని నిర్ణయం
- నెలాఖరులోగా లక్ష్యం చేరేలా అధికారుల చర్యలు

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 5,57,249 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా.. వీటిలో 11,66,305మంది కూలీలు నమోదై ఉన్నారు. ఈ ఏడాది 2,97,169జాబ్ కార్డుల్లోని 5,29,394మంది కూలీలకు ఉపాధి పనులు క ల్పించారు. ఉపాధి పనుల కల్పనలో ఉమ్మడి జిల్లాలోనే నిర్మల్ జిల్లా అగ్ర స్థానంలో నిలువగా.. రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. ఉపాధి పనుల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా కూలీలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫాం పాండ్స్, అడవుల్లో ట్రెంచ్‌లు, భూముల అభివృద్ధి, ఊట చెరువుల తవ్వకం, చేపల పాండ్స్, పశువుల, గొర్రెల షెడ్లు, నాడెపు కాంపౌండ్స్ పిట్స్ నిర్మాణం చేశారు. ఒక్కో కూలీకి సగటున రోజుకు రూ.205చొప్పున అత్యధికంగా చెల్లిస్తుండగా.. అత్యల్పంగా రూ.50 తగ్గకుండా చెల్లిస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఎండ వేడిమి పెరగడంతో.. ఉపాధి వేతనం పెంచా రు. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30శాతం, జూన్ నెలలో 20 శాతం అదనంగా కూలీ డబ్బులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వేసవిలో ఉపాధి కూలీల సంఖ్య తగ్గకుండా, కూలీలకు మరింత గిట్టుబాటు అయ్యేందుకు అవకాశముంది.

ఆదిలాబాద్ జిల్లాలో 157162 జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 330193మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది 3577కొత్త జాబ్ కార్డులను 7536 మందికి జారీ చేశారు. ఈ సారి 72818 జాబ్ కార్డుల్లోని 137241మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరం లో జిల్లాలో మొత్తం రూ.87.10కోట్ల నిధులు ఖ ర్చు చేశారు. రూ.59.66 కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 76.71శాతంగా ఉంది. రూ.18.11కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 23.29 శాతంగా ఉంది. రూ.9.32కోట్లను నిర్వహణ ఖర్చులుగా ఉండగా.. 11.99శాతంగా ఉంది. ఈ ఏడాది 41.92లక్షల పనిదినాలు క ల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 35,03,412 పని దినాలు కల్పించి 83.58శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 48.11రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.165.88చొప్పున చెల్లించారు. ఇక 5991కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.


కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 118548జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 255975 మంది కూలీలున్నారు. ఈ ఏడాది 1380కొత్త జా బ్ కార్డులను 3297మందికి జారీ చేశారు. ఈ ఏడాది 66604జాబ్ కార్డుల్లోని 123458మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 67.57కోట్ల నిధులు ఖర్చు చే శారు. ఇందులో రూ.52.44కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 85.55శాతంగా ఉంది. మెటీరియల్ పనులను రూ.8.86కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 14.45శాతంగా ఉంది. మరో రూ.6.27కోట్లను నిర్వహణ ఖర్చులకు వినియోగం చేయగా.. 10.23శాతంగా ఉంది. ఈ ఏడాది 42.26లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 32,20,941పని దినాలు కల్పించి 76.21శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 48.36రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.162.55 చొప్పున చెల్లించారు. ఇక 5297కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.

మంచిర్యాల జిల్లాలో 126976జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 257381మంది కూలీలున్నారు. ఈ ఏడాది 2375కొత్త జాబ్ కార్డులను 5711మందికి జారీ చేశారు. ఈ ఏడాది 65368 జాబ్ కార్డుల్లోని 109813మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 66.52కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో రూ.45.85కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 77.64శాతంగా ఉంది. రూ.13.20కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 22.36శాతంగా ఉంది. మరో రూ.7.47కోట్లను నిర్వహణ ఖర్చులకు వినియోగం చేయగా.. 12.66శాతంగా ఉంది. ఈ ఏడాది 47.09లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2952273పని దినాలు కల్పించి 72.7శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 45.16రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.157.74చొప్పున చెల్లించారు. 4805కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.

నిర్మల్ జిల్లాలో 159608జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 322805మంది కూలీలున్నారు. ఈ ఏడాది 6540కొత్త జాబ్ కార్డులను 13688మందికి జారీ చేశారు. ఈ ఏడాది 92379జాబ్ కార్డుల్లోని 158882మందికి ఉపాధి పనులు కల్పించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 105.28కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో రూ.77.72కోట్లను ఉపాధి కూలీలకు చెల్లించగా.. 79.79శాతంగా ఉంది. మెటీరియల్ పనులను రూ.19.69కోట్లతో మెటీరియల్ పనులు చేయించగా.. 20.21శాతంగా ఉంది. మరో రూ.7.87కోట్లను నిర్వహణ ఖర్చులకు వినియోగం చేయగా.. 8.09శాతంగా ఉంది. ఈ ఏడాది 54.31లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 49,85,767 పని దినాలు కల్పించి 91.81శాతం లక్ష్యం చేరారు. ఒక్కో కుటుంబానికి సగటున 53.97రోజుల పని చూపగా.. రోజుకు సగటున రూ.159.39 చొప్పు న చెల్లించారు. 9825కుటుంబాలకు 100రోజుల పాటు ఉపాధి కల్పించారు.

100
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles