పత్తి ధర @రూ. 5,860..!

Mon,March 25, 2019 12:23 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆన్‌లైన్‌లో పత్తి ధర రోజురోజుకూ పెరుగుతున్నది. వా రం రోజుల్లో రూ.500 పెరిగింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.5,450 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు పత్తి ధర రూ.5,860 పలుకుతున్నది. అయితే ఈ పెరుగుదలతో రైతులకు ఎలాంటి లాభం లేక పోగా.. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి నిల్వ ఉంచిన ట్రేడర్లకు ప్ర యోజనం చేకూర్చేలా ఉందని రైతులు, మార్కెట్ మార్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మద్దతు ఎవరికి ..?
జిల్లాలో గతేడాది అక్టోబర్ నుంచి పత్తి సీజన్ ప్రా రంభమైంది. మొదట్లో మార్కెట్‌కు భారీగా పత్తి నిల్వలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 3.47 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. దిగుబడి 50లక్షల నుంచి 60లక్షల క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేశారు. ఆదిలాబాద్, భైంసా, ఆసిఫాబాద్ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు అధికంగా జరుగుతాయి. ప్రధానంగా ఆదిలాబాద్, భైంసాలో సీజన్‌లో పత్తి బండ్లతో మార్కెట్ కళకళలాడుతుంది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 నిర్ణయించినా సీసీఐ పెద్దగా కొనుగోలు చేసిందేమి లేదు. ప్రైవేట్ ట్రేడర్సే పత్తిని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. అయితే రైతులకు ఎంఎస్‌పీ దక్కలేదన్న ఆవేదన వ్యక్తమైంది. ప్రధానంగా తేమ కారణంగా చూపుతూ ట్రేడర్స్ పత్తి ధరను క్వింటాల్‌కు అమాంతంగా తగ్గిస్తూ రైతుల కు వందల రూపాయల్లో కోత పెట్టి కొన్నారు. దీంతో మద్దతు ధర మాటేమోనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమైంది. కాగా.. మూడు నెలల నుంచి సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ.100లు తగ్గించి రూ.5350 ఇవ్వడం, వ్యాపారులు ఇదే అదునుగా పత్తిలో తేమను చూపుతూ భారీగా కోత పెడుతూ రైతుల నడ్డి విరిచారు. ప్రధానంగా 5నుంచి 10శాతం మంది రైతులకే ఈ ధర తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. మిగతా రైతులకు రూ.5వేల నుంచి రూ.3,800 వరకు దక్కింది. ఈ పరిస్థితుల్లో రైతులు ఇప్పటికే తమ దగ్గర ఉన్న పత్తి పంటను దాదాపుగా విక్రయించారు.

సీసీఐ కొనుగోలు కేంద్రాలు మూత..
ఉమ్మడి జిల్లాలో సీసీఐ 22కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా కొద్ది రోజులుగా పత్తి నిల్వలు రావడం లేదని వీటిని మూసివేశారు. మార్కెట్‌లో మద్దతు ధర లేని పక్షంలో సీసీఐ రంగంలో ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం మద్దతు ధరను మించి పత్తి అమితంగా ధర పలుకుతుండడంతో సీసీఐకి రైతులు అమ్మే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితుల్లో సీసీఐ నామమాత్రమే.. అయితే మార్కెట్లో రంగంలో ఉన్నా సీసీఐ కేవలం నామమాత్రంగా కొనుగోలు చేసింది. ప్రైవేట్ ట్రేడర్సే అమితంగా పత్తిని కొనుగోలు చేశా రు. పత్తి పంట రైతుల నుంచి చేజారిన తర్వాత ఈ ధరలు పెరగడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు ఎలాంటి లాభం చేకూర్చదని వాపోతున్నారు. స్టాకిస్టులు, ట్రేడర్లు ప్రస్తుతం పత్తి బేళ్లు, క్యాండీలు, సీడ్ విక్రయాల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. ఈ ధరలు ప్రస్తుతం పెరుగుతుండడంతోనే మార్కెట్లో పత్తి ధర పెరుగుతూ వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

89
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles