నేటితో నామినేషన్ల ముగింపు

Mon,March 25, 2019 12:22 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ నామినేషన్ల స్వీకరణకు సోమవారంతో గడువు ముగియనుంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఇప్పటి వరకు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నేటితో గడువు ముగియనుండగా.. భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 18న పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 22వ తేదీన బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు రెండు సెట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ తరఫున నాయకులు ఒక సెట్, ఆయన తనయుడు రితీష్‌రాథోడ్ ఒక సెట్, నవప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కొమురం వందన ఒక సెట్, మొత్తం ఆరు సెట్లు ఇప్పటి వరకు దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గోడం నగేష్ రాష్ట్ర మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, టీడీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డిలతో కలిసి ఉదయం 11.30గంటలకు జిల్లా ఎన్నికల అధికారి దివ్యదేవరాజన్‌కు తన నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు.

109
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles